Telangana

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు.

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

వివిధ కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డులలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పారిశ్రామికవాడగా ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉపాధి పొందుతూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగా ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య నవీన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, లత, అరుణ్, రాజు, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నిజాముద్దీన్ బాబా, సోనియా రాజు, ఆసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago