Telangana

గణేష్ గడ్డ దేవాలయానికి ప్రత్యేక ర్యాంపు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ అధికారులతో సమీక్ష

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం లో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ర్యాంపు, మెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జాతీయ రహదారి విస్తరణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆలయ కమిటీ పాలకవర్గం, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి దేవాలయం సమీపంలో చేపడుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే గణేష్ గడ్డ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గుడి సమీపంలో చేపడుతున్న పనుల మూలంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుండి నేరుగా దేవాలయం పరిసరాల్లోకి వచ్చే విధంగా ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, స్వాగత తోరణం నుండి ఆలయం వరకు మెట్ల నిర్మాణం, నూతన ఆర్చి,.గుడి చుట్టూ 50 అడుగుల సామర్థ్యంతో సిసి ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పైన పేర్కొన్న పనులన్నీ పూర్తి చేయాలని జాతీయ రహదారుల డిఈ రామకృష్ణను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోతే గుడి సమీపంలో అండర్ పాసెజ్ సైతం నిర్మించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, స్థానిక కౌన్సిలర్లు రాజు, లత, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, ఆలయ ఈవో లావణ్య, సీనియర్ నాయకులు నర్సింహ రెడ్డి, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago