అమీన్పూర్ లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గ పరిధిలోని ముదిరాజుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ముదిరాజ్ భవనం పనులకు ఆయన ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవా దృక్పథం ధైర్యానికి మారుపేరైన ముదిరాజులు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ముదిరాజుల కోసం సొంత నిధులచే సంక్షేమ సంఘ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ ను రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేశారు. అమీన్పూర్ లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన్ నిర్మాణానికి సైతం త్వరలోనే నిధులు అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ. ముదిరాజులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గము నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేష్, బాలరాజు, ఉపేందర్, కృష్ణ, బిజీలీ రాజు, చదువుల మల్లేష్, రాములు, బాశెట్టి అశోక్, రాజేష్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…