Telangana

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 లక్షల 85 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందనిపటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, ప్రమోద్ గౌడ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

8 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

1 day ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 days ago