రుద్రారంలో పిఎసిఎస్ దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని పిఎసిఎస్ ఆవరణలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలువ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. దుకాణాల సముదాయాలు ద్వారా పిఎసిఎస్ లకు ఆర్థిక లభ్యత పెరుగుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో అర్హులైన రైతులకు. రుణాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు ఆర్థిక అభ్యున్నతిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో హాజరైన పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, పాలక మండలి డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…