పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు.. పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్పులు సాధించిన విద్యార్థులను సైతం ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాండురంగం రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…