_బండలగూడలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి భవనాల ప్రారంభం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సహకారం ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని బండలగూడ మార్క్స్ కాలనీలో పారగాన్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలు నివసించే మార్క్స్ కాలనీలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించడం పట్ల పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్ళలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. పాఠశాలలో గ్రంథాలయం పుస్తకాల కోసం సొంత నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బండలగూడ అధ్యక్షులు గోపాల్, పరిశ్రమ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రతినిధులు బిను, శ్రీజిత్, మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…