Telangana

వీఆర్ఏల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

_అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఉద్యోగాల సంక్షేమంతో పాటు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పటాన్చెరు మండల వీఆర్ఏల ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago