పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ లో పరిశోధనను పెంపొందించడానికి జూలై 20-21 తేదీలలో ‘విద్యార్థుల కోసం నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హెదరాబాద్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు ప్రొఫెసర్ కుర్రి శ్రీ స్రవంతి శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.కళ, వాస్తుశిల్పం ద్వారా నగరాల గుర్తింపు; నిర్మాణ సంస్కృతి, వారసత్వ నిర్వహణ, పర్యావరణ సామర్థ్యం, స్థిరమైన భవిష్యత్తు; సమకాలీన నిర్మాణ పద్ధతులు, వాస్తుశిల్పంలో వైవిధ్యం వంటి ఇతివృత్తాలతో ఈ సింపోజియం నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు.ఆసక్తి ఉన్నవారు, జూన్ 12వ తేదీలోగా పరిశోధనా పత్రాలను సమర్పించాలని; వాటిపై వ్యాఖ్య లేదా ఆమోదాన్ని జూలై 1వ తేదీలోగా తెలియజేస్తాయని, తుది సమర్పణ జూలై 10వ తేదీగా చేయాలని నిర్వాహకురాలు స్పష్టీకరించారు.బీఆర్క్ ఎంఆర్క్, పీహెచ్ చేస్తున్న విద్యార్థులు ఈ సింపోజియంలో పాల్గొనడానికి అర్హులని, ఇందులో పత్ర సమర్పణ చేసేవారికి ఉచిత వసతితో పాటు 3-ఏ/సీ రెల్లు టిక్కెట్లు ఇస్తామని ఆమె తెలిపారు. ఇతరత్రా వివరాల కోసం spaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…