Telangana

ఎన్ఎమ్ఆర్ యువసేనలో చేరిన_ పటాన్చెరు విశ్వకర్మ సంఘం ఇన్చార్జ్ నారాయణ చారి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్బహిస్తున్న సేవాకార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్ఎమ్అర్ యువసేన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి కి చెందిన విశ్వకర్మ సంఘం పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి నారాయణ చారీ ఎన్ఎంఅర్ యువసేన లో చేరారు. బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ఆయనను సాదరంగా యువసేనలోకి ఆహ్వానించారు,ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న ప్రజలకు తన వంతుగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్ఎంఅర్ యువసేన పని చేస్తుందన్నారు. ఎన్ఎంఅర్ యువసేన చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. మీరు ఇస్తున్న తోడ్పాటు అందరి మద్దతుతో భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి పని చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడలలలో నడుస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. భవిష్యత్తులో ఎన్ఎంఅర్ యువసేన పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. అనంతరం నారాయణ చారీ మాట్లాడుతూ ఎన్ ఎం అర్ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలు భేష్ అన్నారు. నీలం మధు నాయకత్వంలోని ఎన్ ఎం అర్ యువసేన లో పనిచేస్తూ ప్రజలకు తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి మధుసూదన్,పటిమేది పాండు,ch వెంకటేష్,సుభాష్,తదితరులు, పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago