Telangana

మియాపూర్ నుంచి సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు సాధించ‌డ‌మే మ‌న ల‌క్ష్యం – మెట్రో రైల్ సాధన సమితి అధ్య‌క్షుడు,మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు:

మెట్రోరైలు సంగారెడ్డి వ‌ర‌కు సాధించేంత వ‌ర‌కు మెట్రోరైల్ సాధ‌న స‌మితి పోరాటం చేస్తుంద‌ని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .ప‌టాన్ చెరు గాయిత్రి ఫంక్ష‌న్ హాల్ లో మెట్రో రైల్ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా డిజిట‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదిక‌ను ఉప‌యోగించుకుంటామ‌న్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందని మెట్రోరైల్ సాధన లో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు మెట్రోరైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రోరైల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తామ‌న్నారు. మెట్రోరైలు సాధ‌న కోసం కార్యాచరణ రూపొందించినట్లు మాజీ ఎమ్యెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టుశ్రీధర్, రాజెందర్ రెడ్డి, బిక్షపతి, మన్నె రాములు,కలివేముల రాజు, రమేష్, రవి ,బలరాం తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago