Telangana

ఒక‌రి ర‌క్త‌దానం మ‌రొక‌రికి ప్రాణ‌దానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:

ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని..మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేసిన వార‌మ‌వుతామ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ఇస్నాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఉచిత వైద్య‌, ర‌క్త‌దాన శిభిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. పటాన్ చెరు ఓబిసి మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ,రక్తదాన శిబిరం నిర్వహించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ర‌క్తదానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు .త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప్ర‌తి నెల ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌ని…వారికి స‌రైన స‌మ‌యంలో ర‌క్తం ఎక్కించ‌క‌పోతే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంటుంద‌న్నారు.
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్కరించుకుని ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు గ‌డీలశ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నరేందర్ రెడ్డి లు హాజ‌ర‌య్యారు. ఓబిసి మోర్చా చేపట్టిన వైద్య శిభిరానికి, ర‌క్త‌దాన శిభిరానికి సహాకరించిన మహేశ్వర మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జనగాం జిల్లా ఇన్చార్జ్ శేఖర్, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ బేజుగం శ్రీనివాస్ గుప్తా, నరెందర్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, పటాన్చెరు మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago