పటాన్‌చెరు శిశు విహార్ హైస్కూల్‌లో సైబరాబాద్ ‘షీ టీమ్’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
అపరిచిత వ్యక్తులు, అసభ్య ప్రవర్తన పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థినులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలి
సదస్సులో పాఠశాల చైర్మన్ అనిల్ కృష్ణ పిళ్లై, హెచ్‌ఎం బినా పిళ్లై
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులకు వ్యక్తిగత భద్రత, చట్టాలపై అవగాహన ఉండడం ఎంతో అవసరమని సైబరాబాద్ పోలీస్ షీ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని కర్దనూరు గ్రామంలో శిశు విహార్ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం సైబరాబాద్ షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ సమాజంలో బాలికలు మరియు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆపద సమయంలో లేదా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా విద్యార్థినులు భయపడకుండా, ధైర్యంగా ఎదుర్కొని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ప్రత్యక్షంగా వివరించారు.బాలికలు గానీ, మహిళలు గానీ ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు లేదా ఎటువంటి ఇబ్బందులకు గురైనా వెనుకాడకుండా వెంటనే షీ టీమ్ 8712663679 వాట్సాప్/కాల్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు కాలయాపన చేసే మొబైల్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉండాలని ఎస్‌ఐ హితవు పలికారు. తల్లిదండ్రులు ఎన్నో నమ్మకాలతో, ఆశలతో చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థినులు కేవలం చదువు, శారీరక-మానసిక వికాసంపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.బంధువులైనా, బయటివారైనా లేదా తెలిసిన వారైనా సరే ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే (గుడ్ టచ్ – బ్యాడ్ టచ్) ఏమాత్రం భయపడకుండా తక్షణమే తమ తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన స్నేహితులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. దాచడం వల్ల సమస్య పెద్దదవుతుందని, వెంటనే వ్యక్తపరచడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అనిల్ కృష్ణ పిళ్లై, ప్రధానోపాధ్యాయురాలు బినా పిళ్లై, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…