పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారికి ఫోన్ లో సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతులకు బకాయి పడిన బోనస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, రామచందర్, వెంకటేష్, పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…