భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంజూరు అయిందని ఆయన తెలిపారు.అమీన్పూర్ మున్సిపాలిటీ తో పాటు తో పాటు రామచంద్రాపురం పరిధిలోని డివిజన్లు, మున్సిపాలిటీలు నూతన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం..మంగళవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల పాత గ్రామపంచాయతీ భవనాన్ని వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీజడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎక్సైజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్, సత్యనారాయణ, ఏఈ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…