ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీలను సందర్శించి, మనదేశ నిర్మాణ వారసత్వ పరిశీలన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మూడవ ఏడాది విద్యార్థులు రెండు వారాల పాటు ఉత్తర భారతదేశంలో విద్యా అధ్యయన పర్యటనను చేశారు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంగణాల ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీ వంటి చారిత్రాత్మక నగరాలను పర్యటించి, భారతదేశ గొప్ప నిర్మాణ వారసత్వాన్ని లోతుగా పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాగ్రత్తగా రూపొందించిన ఈ పర్యటన విద్యార్థులకు మొఘల్ వైభవం నుంచి రాజపుత్ క్లిష్టత, సమకాలీన ఆవిష్కరణల వరకు విభిన్న శ్రేణి నిర్మాణ శైలులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది.
ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం, జైపూర్ లోని అయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో విద్యా మార్పిడి. అక్కడి విద్యార్థులతో ఆలోచనలను రేకెత్తించే చర్చలు, సహకార అభ్యాసంలో పాల్గొని, అంతర్-సంస్థాగత జ్జాన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నారు.ఆ తరువాత, జైసల్మేర్ లోని రాజకుమారి రత్నవతి బాలికల పాఠశాల సందర్శన అద్భుతమైన అనుభవాలలో ఒకటి. ఇది స్థిరమైన నిర్మాణ శైలికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. స్థానిక బాలికలను విద్య ద్వారా శక్తివంతం చేయడానికి రూపొందించబడిన ఈ సంస్థ, పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్ యొక్క పరివర్తన ప్రభావాన్ని చూపడమే గాక, సామాజిక మార్పును నడిపించడంలో వాస్తు శిల్పం పాత్రను విశదీకరిస్తోంది.తరగతి గది అభ్యాసానికి మించి, ఈ అధ్యయన పర్యటన విద్యార్థులకు సాంప్రదాయ, ఆధునిక నిర్మాణ పద్ధతులపై సమగ్ర దృక్పథాన్ని అందించింది.
సమకాలీన అనువర్తనాలతో చారిత్మక అంతర్దృష్టులను అనుసంధా నించడం ద్వారా, ఈ ప్రయాణం వారి విద్యా కార్యకలాపాలను సుసంపన్నం చేసింది. సంస్కృతి, సమాజాలపై వాస్తుశిల్పం యొక్క లోతైన ప్రభావం పట్ల వారిలో ఆలోచనలను రేకెత్తించింది.ఈ స్వీయ పరిశీలానుభవం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఆచరణాత్మక అభ్యాసం, విశ్వశ్రేణి అవగాహనలపై దాని నిబద్ధతను చాటి చెబుతోంది. జ్జాన దృష్టితో భవిష్యత్తును రూపొందించే, ముందు చూపుతో యోచించే వాస్తుశిల్పులుగా మారడానికి విద్యార్థులను సిద్ధం చేస్తోంది.
సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…