Telangana

మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను చేపట్టాలి

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను చేపట్టాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ శాఖ డైరెక్టర్ కార్యాలయం ఖైరతాబాద్ వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న సందర్భంగా పటాన్ చెరు ఆర్టీసీ బస్టాండు దగ్గర ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి నాగేశ్వరావు మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో గత సంవత్సర కాలం నుండి ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలలోని గ్రామాలలో ఉపాధిహామీ పనులను నిలిపివేశారని ఆరోపించారు.మున్సిపల్ పేరుతో గ్రామాల్లోని కూలీలక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొట్టలు కొడుతున్నారన్నారు. పనులు దొరకకపోవడంతో గ్రామాల్లోని కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, మున్సిపల్ ఏర్పాట అయ్యేంతవరకు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేశారని గుర్తు చేశారు.

పటాన్ చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాలలో వందలాదిమంది కూలీలు లక్డారం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, జిన్నారం మండలంలోని రాళ్లకత్వ, సో లక్ పల్లి, ఓట్ల, కొడకంచి, శివానగర్, అండూరు ఇతర అనేక గ్రామాలలో ఉపాధి హామీ పనుల చేశారని, ప్రస్తుతం గ్రామాలలోని కూలీలు ఉపాధి హామీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఎదురు చూస్తున్నారని తెలిపారు . ఎల్ ని నో ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కూడా కరువు పరిస్థితిలో ఏర్పడడంతో రాష్ట్ర ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించిందని, అందులో పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి కరువులో భాగంగా ఉపాధి హామీ పనులను చేపట్టాలని అన్నారు.కరువుకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కూలీల నాదుకోవలసిన బాధ్యత ఉన్నదని అన్నారు.

అందుకోసం పటాన్చెరు నియోజకవర్గంలోని డిమాండ్ ఉన్న అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించేలా జిల్లా అధికార యంత్రాంగం తగిన కృషి చేయాలని అన్నారు. లేనిపక్షంలో పటాన్ చెరు నియోజకవర్గంలోని ఉపాధి హామీ కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కార్యాలయం ఖైరతాబాద్ వద్ద జరుగే నేడు ధర్నాకు పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల నుండి కూలీలు వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు లక్ష్మి, జుబేరా ఇతరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago