50 లక్షల రూపాయలతో కర్ధనూర్ లో మోడల్ మార్కెట్…
– కోతుల ఆహార కేంద్రం ప్రారంభం
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతో మోడల్ మార్కెట్ ను నిర్మించబోతున్నట్లు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం కర్ధనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార కేంద్రం, స్వచ్ఛ హి సేవ 2021 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ …పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్ల విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మినీ మార్కెట్లు నిర్మిస్తోందనీ అన్నారు. మార్కెట్ నిర్మాణానికి 12 లక్షలు మంజూరు అయ్యాయని, మరో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలను వివిధ నిధుల ద్వారా సమకూర్చి మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
కోతుల కోసం ప్రత్యేకంగా ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. స్వచ్ఛ హి సేవ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను రోజులపాటు సమాధాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఎ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, ఎంపీడీవో బన్సీలాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…