పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పారిశ్రామిక వాడ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు ఐలా నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో పరిశ్రమల యజమాన్యాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు యాజమాన్యాలు మరింత ముందుకు రావాలని కోరారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐలా చైర్మన్ సుధీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుటుంబ రావు, జగన్, సురేందర్ రెడ్డి, మురళి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, తిరుమల రావు, శంకర్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…