Telangana

నేడు పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారాల పంపిణీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు.. పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్పులు సాధించిన విద్యార్థులను సైతం ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాండురంగం రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

9 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

9 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

9 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

9 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago