దివ్యాంగుడికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేయూత
సొంత నిధులతో ఆటో అందజేత
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి వెన్నుపూస గాయంతో ఉపాధి లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తన కుటుంబ సభ్యులను సైతం కోల్పోయాడు. తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో వెన్నుపూసకు గాయం కావడంతో ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.స్వయం ఉపాధి కల్పించాలని ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఆటో కొనుగోలు చేశారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా విష్ణువర్ధన్ రెడ్డికి ఆటో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. గతంలో దేశంలోని మొట్టమొదటిసారిగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం 400 స్కూటీలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెలిమల పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, షకీల్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…