అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలని కోరారు. నియోజకవర్గంలో వీరశైవుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 30 లక్షల రూపాయల సొంత నిధులతో బీరంగూడ కమాన్ వద్ద మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. హాజరైన అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షులు నర్సింలు, నియోజకవర్గ అధ్యక్షులు జగదీశ్, రుశ్వంత్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…