కోవిడ్ మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోండి
పటాన్ చెరు:
జిహెచ్ఎంసి పరిధిలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను 18 ఏళ్లు పై బడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భారతి నగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో ప్రతి కాలనీలో మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు వాక్సినేషన్ వేయించుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఇమ్రాన్, వీరా రెడ్డి, బల్దియా సిబ్బంది పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…