Telangana

కాంట్రాక్ట్ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుడు కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మగ్దంపూర్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి గత కొద్ది రోజుల క్రితం జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని ఆరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధుల్లో చేరాడు. ఇటీవల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కార్మికుడికి న్యాయం చేయాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

9 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

21 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

21 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

21 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

21 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago