Telangana

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన : చిట్కుల్ సర్పంచ్ నీలం మదు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు:

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యంగ నిర్మాత పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దేశం గర్విస్తున్నది, అంతటి గొప్ప మహానుభావుడి పేరు పెట్టడంతో తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శంగా నిలవనున్నదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సచివాలయానికి అబేంద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి, అలాగే సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు మధు పాలబిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ వైపు దళిత అభ్యన్నతికి అహర్షిషలు శ్రమిస్తూనే మరో వైపు అంబేద్కర్ ను సగర్వంగా గౌరవించుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టడం లేదని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పడు ఏమంటాయని ప్రశ్నించారు.

అద్భుతమైన, దేశ గర్వపడే నిర్ణయాలు తీసుకోవడంలో పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ కు మరొకరు సాటిరారన్నారు. తెలంగాణ పథకాలు ఇప్పుడే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దళిత బంధు పథకంతో దళిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని నీలం మధు ముదిరాజ్ అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి పాలభిషేకాలు చేస్తున్నారని తెలిపారు . తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, వెంకటేష్, భుజంగం,మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ఆంజనేయులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago