Telangana

భారత వాయుసేనలో చేరండి

గీతం విద్యార్థులకు పిలుపునిచ్చిన ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులుగా లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవ చేయాలని గీతం విద్యార్థులను భారత వాయుసేనకు చెందిన మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ ప్రోత్సహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం – వృత్తి మార్గదర్శనం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఐఏఎఫ్ సహకారంతో, గీతం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయుధ దళాలలో వృత్తి అవకాశాల గురించి విద్యార్థులలో అవగాహన కల్పించారు. పలువురు వాయుసేన అధికారుల బృందంతో వచ్చిన దీపక్ భరద్వాజ్, విద్యార్థుల ప్రయోజనం కోసం భారత వైమానిక దళ సామర్థ్యాలను ప్రదర్శించే ఒక మొబైల్ ఎగ్జిబిషన్, సిములేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

సమావేశాన్ని ఉద్దేశించి దీపక్ భరద్వాజ్ మాట్లాడుతూ, యూపీఎస్సీ, ఏఎఫ్ క్యాట్, ఎన్.సీ.సీ. స్పెషల్ ఎంట్రీ ద్వారా పర్మనెంట్ కమిషన్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్ తో ఐఏఎఫ్ లో చేరవచ్చన్నారు. ఒకసారి ప్రవేశ స్థాయి అధికారిగా చేరాక, వైమానిక దళాధిపతి (చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్) పదవి వరకు ఎదగొచ్చని చెప్పారు. అలాగే ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలతో పాటు, ప్రతి విభాగానికి కావలసిన అర్హతా ప్రమాణాలు, అవసరమైన అర్హతల గురించి కూడా ఆయన విపులంగా తెలియజేశారు.అంతే కాకుండా, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఐఎఫ్ఎస్బీ) ప్రక్రియను కూడా ఆయన వివరించారు. ఇందులో రాత పరీక్షలు, వ్యక్తిత్వ మదింపు, మానసిక పరీక్షలు, గ్రూపు టాస్క్ లు, ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు, ప్రతిభ ఆధారిత ఎంపిక వంటి అంశాలు కూడా ఉంటాయన్నారు. శాస్త్రీయ, పారదర్శకమైన ఎంపిక విధానాన్ని ప్రస్ఫుటీకరిస్తూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో సిద్ధం కావాలని ఆయన ప్రోత్సహించారు.

వైమానిక దళ వృత్తి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దీపక్ భరద్వాజ్ ఆకర్షణీయమైన జీతభత్యాలు, సదుపాయాలతో కూడిన వసతి, సమగ్ర వైద్య సంరక్షణ, విద్యావకాశాలు, సెలవు ప్రయోజనాలు, బీమా సౌకర్యం, సాహస కార్యకలాపాలు, వృత్తిపరమైన అభివృద్ధి గురించి మాట్లాడారు.భారత వైమానిక దళం పరిణామం, జాతీయ భద్రత, సైనిక లాజిస్టిక్స్, మానవతా సహాయం, విపత్తు సహాయం, క్షతగాత్రుల తరలింపులో దాని కీలక పాత్రలతో పాటు 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల సమయంలో దాని సహకారం గురించి కూడా ఒక అవలోకనాన్ని అందించారు. ఐఏఎఫ్ ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, గగనతల నిఘా వ్యవస్థలను ఆయన విద్యార్థులకు పరిచయం చేశారు.

తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణు కుమార్ నాతి అతిథులకు స్వాగతించి, సత్కరించగా, కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు వృత్తి అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపక బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ఐఏఎఫ్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

16 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

17 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

17 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

21 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

21 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

21 hours ago