Telangana

గీతం నృత్య స్టూడియోలను ప్రారంభించిన కళైమామణి నందిని రమణి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పండితురాలు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళైమామణి నందిని రమణి, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కొత్తగా స్థాపించిన నృత్య స్టూడియోను సోమవారం ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు, కళా విద్యను బలోపేతం చేయడానికి, సృజనాత్మక అభ్యాసం, కళాత్మక నైపుణ్యం కోసం విద్యార్థులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి గీతం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

తొలుత ఆమె గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఇండక్షన్ కార్యక్రమంలో ‘నృత్యం, సంస్కృతి, సమాజం’ అనే అంశంపై స్ఫూర్తిదాయక ఉపన్యాసం చేశారు.నూతన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నృత్యం, సంస్కృతి, సమాజం మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని నందిని రమణి అనర్గళంగా వివరించారు. ప్రదర్శన కళలు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, అలాగే వ్యక్తిగత శీలాన్ని, సామూహిక గుర్తింపును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె నొక్కి చెప్పారు. ప్రఖ్యాత విదుషి టి. బాలసరస్వతితో తనకున్న అనుబంధానికి సంబంధించిన మధుర జ్జాపకాలను కూడా ఆమె పంచుకున్నారు.

భారతదేశపు అత్యంత విశిష్టమైన శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో ఒకటైన దాని గురించి విద్యార్థులకు అరుదైన అంతర్దృష్టులను అందించారు.అలాగే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన బెహాగ్ రాగంలోని ఒక జావళి ఆకర్షణీయమైన ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ జావళిని ఆమె బాలమ్మ (విదుషి టి.బాలసరస్వతి) వద్ద నేరుగా నేర్చుకున్నారు. ఆమె ప్రదర్శన, విద్యార్థులు, అధ్యాపకులకు ప్రఖ్యాత బాలసరస్వతి శైలి యొక్క ప్రామాణిక అనుభూతిని అందించడమే గాక, ఉత్సాహభరితమైన ప్రశంసలను అందుకుంది.నందిని రమణి విజ్జానదాయమైన సంభాషణకు లలిత, ప్రదర్శన కళల విభాగం హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది. ఆమె పర్యటన, భారతదేశపు కాలాతీత శాస్త్రీయ నృత్య వారసత్వం పట్ల, సమకాలీన సమాజంలో దాని నిరంతర ప్రాముఖ్యత పట్ల విద్యార్థులలో లోతైన అవగాహనను పెంపొందించడానికి స్ఫూర్తినిచ్చిందరి పేర్కొంది.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

16 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

17 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

17 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

21 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

21 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

21 hours ago