పటాన్‌చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
అత్యంత సామాన్య కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్సైల్ మెన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నేటితరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలను తరిమికొట్టాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి లోకంపైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, అశోక్, పృథ్వీరాజ్, వెంకటేష్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…