politics

పటాన్‌చెరు ప్రగతిలో ప్రతి ఓటు అత్యంత కీలకం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి ఓటరుని కలవండి.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములను చేయండి 

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని  పటాన్‌చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలంటే అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలు సమర్పించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో ఎస్ఐఆర్ అంశం పైన ముత్తంగి డివిజన్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఆశించిన మేరకు జరగడంలేదని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 61.21 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ప్రతి రోజు కాలనీలలో తిరుగుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొనని ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి.. తమ వివరాలు నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. ప్రక్రియ పూర్తయ్య వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని రాబోయే వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ముందుకు కొనసాగాలని సూచించారు.సమిష్టి కృషితో ఎస్ఐఆర్ అంశంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ గా పటాన్చెరు నియోజకవర్గాన్ని నిలపాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాండు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు ఉపేందర్, శ్రీకాంత్, కుమార్ గౌడ్, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కొమరయ్య, రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

4 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

22 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

22 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago