గుమ్మడిదలలో మిలాద్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల ,మనవార్తలు ప్రతినిధి :
ఐదు సంవత్సరాలుగా మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో రక్తదానంపై చైతన్యం పెంపొందించడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం పురస్కరించుకొని.. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ఫంక్షన్ హాలులో వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిలాద్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాలలో కన్నా రక్తదానం మహా గొప్పదని అన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. రక్తదానం విశిష్టతను ప్రచారం చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. రక్తదానంతో పాటు వివిధ సమాజసేవ కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. రక్తదానం ద్వారా మనిషి శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, సిఐ నయీముద్దీన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…