Telangana

పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు

_టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారికత

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలను శుక్రవారం ఉదయం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాజ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ లాంటి వినూత్న పథకాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు అందించడంతోపాటు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం అందిస్తున్నారని అన్నారు. ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహిళ ఉద్యోగినులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

23 hours ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

23 hours ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

2 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

2 days ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

2 days ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

2 days ago