Telangana

విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సమాజం నుండి మాదకద్రవ్యాలను తరిమికొట్టాలి..

ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవాలి..

క్రీడలు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

వివిధ రాష్ట్రాల నుండి హాజరైన రెండు వేల మంది క్రీడాకారులు

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు

కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు.. తల్లిదండ్రులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక ధారుడ్యత కోసం విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని భారత రత్న పివి నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కరాటే పోటీలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.

వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది క్రీడాకారులు టోర్నమెంట్ కు హాజరు కావడం పటాన్‌చెరు నియోజకవర్గం యొక్క ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పినట్లు అయ్యిందని అన్నారు. చిన్ననాటి నుండి తనకు క్రీడలు అంటే ఎంతో మక్కువ అని, నియోజకవర్గ స్థాయిలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని ఆధునికరించడంతోపాటు ఏడాది పొడవునా వివిధ క్రీడ అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని సమాజం నుండి వాటిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థి దశ నుండి పిల్లలకు వాటి దుష్పరిమానాలను వివరించాలని కోరారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల పైన ఆసక్తి పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. క్రీడాకారులకు ఎటువంటి సహకారం కావాలన్న తనను సంప్రదించాలని కోరారు. కరాటే పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago