Telangana

కిర్బీ పరిశ్రమలో సీఐటీయూ చారిత్రాత్మికమైన వేతన ఒప్పందం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

117 మంది క్యాజువల్ కార్మికుల పర్మినెంట్

గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనం పెంపు

రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ

కార్మికుల భద్రత, సంక్షేమం సిఐటియుతోనే సాధ్యం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పాశమైలారం పారిశ్రామిక వాడ లోని కిర్బీ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం సాధించామని, ఈ పరిశ్రమలో 117 మంది క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు పేర్కొన్నారు. వేతన ఒప్పందం సందర్భంగా గురువారం జరిగిన పరిశ్రమ గేట్ మీటింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనంలో ఒక్కో కార్మికుడికి కిర్భి పరిశ్రమ చరిత్రలోనే పెంపుదల సాధించామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ పెంచమన్నారు. ఎడ్యుకేషన్ అలవెన్స్, సర్వీస్ అవార్డ్స్, నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అలవెన్స్, హార్డ్ షిఫ్ట్ అలవెన్స్లు పెంచామని తెలిపారు. కార్మికుల ఉద్యోగ భద్రత సంక్షేమం హక్కులను రక్షించడం సిఐటియు తోనే సాధ్యమని చెప్పారు. లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ నేపథ్యంలో కార్మికుల పర్మినెంట్ అనేది లేనీ తరుణంలో 117 మంది కార్మికులను పర్మినెంట్ చేయడం అనేది ఒక చారిత్రాత్మకమన్నారు. ఈ చారిత్రాత్మక వేతన ఒప్పందము సందర్భంగా పరిశ్రమ కార్మికులు చుక్క రాములను అభినందించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతిమేల మానిక్, గౌరవ అధ్యక్షులు కె.రాజయ్య, జనరల్ సెక్రటరీ వి.ఎస్ రాజు, పాశమైలారం గ్రామ పెద్దలు సుధాకర్ గౌడ్, బానూర్ సర్పంచ్ శాంతయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago