పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ద్వితీయ రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ మహాసభల ఆహ్వాన పత్రికను బుధవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ మహాసభలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. మహాసభల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…