గీతం చర్చాగోష్ఠిలో వక్తల అభిప్రాయం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మన దేశ ఎన్నికల ప్రచారంలో రాజకీయ కన్సల్టెన్సీల ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉందని ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ‘భారతదేశంలో ఎన్నికల ప్రచారాలు – పెరుగుతున్న రాజకీయ సలహాదారుల పాత్ర’ అనే అంశంపై శుక్రవారం ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ కైలాష్ కున్హి క్రిష్ణన్, లైడెన్ లోని రాయల్ నెదర్లాండ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ కరీబియన్ స్టడీస్ లో రీసెర్చి ఫెలో డాక్టర్ విఘ్నేష్ కార్తీక్ కేఆర్ వంటి ప్రముఖ వక్తలు పాల్గొన్నారు. భారతదేశ ఎన్నికల దృశ్యంలో రాజకీయ కన్సల్టెన్సీల పాత్ర పెరగడంపై డాక్టర్ విఘ్నేష్ ప్రధానంగా ప్రసంగించారు. ఈ కన్సల్టెన్సీలు వ్యూహాత్మక వనరుల కేటాయింపు, ఉపన్యాస మెళకువలు, సిబ్బంది నిర్వహణ ద్వారా పార్టీలకు అధికారం ఇస్తాయని, పొలిటికల్ ఎడ్జ్ (2014) వంటి మార్గదర్శకుల నుంచి నేషన్ విత్ నమో (2023-24) వంటి సిద్ధాంతిక కన్సల్టెన్సీలుగా మారడాన్ని విఘ్నేష్ ఉటంకించారు.
ఈ మార్పుకు దారితీసే ముఖ్య కారకాలు- మనదేశ అధిక జనాభా, లోతైన ప్రజాస్వామ్యీకరణ, పెరిగిన సాంకేతికత వినియోగం, సగం మంది మాత్రమే తిరిగి ఎన్నికోవడంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఎన్నికల ఖర్చులు ఇప్పుడు అమెరికాకు పోటీగా ఉన్నాయని, స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు ప్రధాన ఆందోళనగా ఉద్భవించాయని చెప్పారు. భారత రాజకీయ పార్టీలను కేంద్రీకృత ఎన్నికల యంత్రాలుగా మార్చడం గురించి ప్రొఫెసర్ కైలాష్ కున్హి విశదీకరించారు. వాటిని బలహీనంగా వ్యవస్థీకృతంగా, అతిగా కేంద్రీకరించబడినవిగా ఆయన అభివర్ణించారు. 1989 నుండి రెండు పార్టీల పోటీ నుంచి మూడవ పార్టీ వ్యవస్థ ఆవిర్భావాలను ప్రస్తావించారు. అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడు వారి సంస్థాగత నిర్మాణాలు, సిద్ధాంతాలలో చాలా సారూప్యతను కలిగి ఉన్నాయన్నారు. బయటి నిధుల వనరులపై ఎక్కువగా ఆధారపడే రాజకీయ నాయకుల జవాబుదారీతనం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలు, పార్టీ సభ్యుల పాల్గొనే విధానాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రొఫెసర్ కైలాష్ వివరించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థుల ఎంపిక పరిణామ స్వభావాన్ని కూడా ప్రస్తావించారు. పార్టీ నాయకత్వం తరచుగా స్వయంగా ఎన్నికల ఖర్చును భరించగల అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తోందన్నారు. రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యం, జవాబుదారీతనంపై ఈ మార్పుల ప్రభావం గురించి ఆలోచించవలసిందిగా హాజరైన వారిని ఆలోచింపజేయడం ద్వారా ప్రొఫెసర్ కైలాష్ తన ప్రసంగాన్ని ముగించారు.ఇద్దరు వక్తలూ పలువురు విద్యార్థులు, అధ్యాపకులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మయాంక్ మిశ్రా అతిథులను స్వాగతించగా, నిర్వాహకుడు డాక్టర్ సురేష్ కుమార్ దిగుమర్తి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…