Telangana

పటాన్చెరులో ఆక్రమ వెంచర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు-భాధితులు

 _తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేస్తున్నారు -బాధితులు

_మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తుసుకుని మాకు న్యాయం చేయాలి 

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

తమ ప్లాట్లలో బయటి వ్యక్తులు వచ్చి అక్రమ వెంచర్లు వేసి, ప్లాట్లను ఇతర వ్యక్తులకు అమ్మి మాకు అన్యాయం చేస్తున్నారని భాధితులు సాంబశివరావు, కిరణ్ రాజు, భాస్కర్ రావు, సురేష్, నారాయణరావు సుబ్బారావు లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ లోని వారి ప్లాట్ల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, కొత్తగూడెం, మణుగూరు, కొలబెల్ట్ ప్రాంతంలోని సింగరేణిలో ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో 1985 లో మేమందరం సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం రామేశ్వర బండ గ్రామంలోని సర్వేనెంబర్ 183,184, 221 లోని దాదాపుగా 100 ప్లాట్లకు పైన (ఒక్కొక్క ప్లాటు 350 చదరపు గజాలు) సంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ న్యాయ స్థానం ఆధ్వర్యంలో వేలంలో కొన్నటువంటి వ్యక్తులు, లేఔట్ వేసి అమ్మిన ప్లాట్లను కొనుగోలు చేశామని అన్నారు. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని తెలిపారు. ఈ విషయం అంత రామేశ్వరం బండ గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు పూర్తిస్థాయిలో తెలుసని అన్నారు.

మాకు ఇల్లు నిర్మించుకోవడానికి గ్రామపంచాయతీ ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పారు. మా అందరికీ తెలియకుండా రామరాజు అనే వ్యక్తి తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేయడం జరిగినదని అన్నారు. దీనిపై అనేకసార్లు పోలీస్ స్టేషన్లో సైతం కేసు పెట్టేందుకై దరఖాస్తులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు. అదే వ్యక్తి మా ఫ్లాట్లలో ప్రవేశించి ప్రహరిగొడ నిర్మిస్తున్నారని, అంతే గాక మా ఫ్లాట్ లను చిందర వందర చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇది తెలిసి మేము అక్కడకు వెళ్ళగా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడమే గాక మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరేం చేయలేరు అని మమ్ములను బెదిరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా యొక్క ప్లాట్ లలో చేరబడి, మాకు బెదిరించి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

7 hours ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

7 hours ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

7 hours ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

7 hours ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

21 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

21 hours ago