Telangana

ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారు – గడిల శ్రీకాంత్ గౌడ్

_బి ఆర్ ఎస్ నేతలు ధరణి పేరుతో రైతులను దోచుకుంటున్నారు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారని బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని … రెవెన్యూ అధికారుల అండదండలతో ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మొదలుకొని బారస మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నాయకుల వరకు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని ఆరోపించాడు.ధరణి పోర్టల్ లో ఉన్న రైతుల భూములకు సమస్యలను సృష్టించి వారే పరిష్కరిస్తున్నారని అయిన అన్నారు.సమస్యను పరిష్కరించడానికి పేద రైతులను అమయాకపు భూ యజమానులను భయబ్రాంతులకు గురిచేసి వారి భూములను అక్రమంగా ఆక్రమించి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని‌ ఆయన మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాలు , మండల కార్యాలయాలు ,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ధరణి సమస్యల పరిస్కారం కోసం భారతీయ జనతాపార్టీ తరపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. .

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, రాజ్ గోపాల్, దుర్గా సాయి, ఆదిత్య,నవిన్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago