మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది . ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిత్ర నేషనల్ అవార్డ్స్ – 2026 చాలా సంతోషంగా ఉందని యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు .హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డు వేడుకకు హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతల మీదుగా అవార్డ్ ను అందుకున్నారు . పటాన్‌చెరు కేంద్రంగా గత ఎన్నో సంవత్సరాలుగా యండిఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాధ శవాల అంత్యక్రియలు, పేదలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం, వైద్య సహాయం, రేషన్ కిట్ల పంపిణీ, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, యండిఆర్ ఫౌండేషన్‌కు లభించిన 23వ జాతీయ అవార్డును గౌరవంగా స్వీకరిస్తున్నామని , ఇది మా సేవా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో మున్ముందు కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం” అని తెలిపారు.సేవే లక్ష్యంగా సమాజ హితం కోసం యండిఆర్ ఫౌండేషన్ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందిని తెలిపారు . ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు , జాతీయ చైర్మన్ డా. యామినేని ఉప్పలరావు , సినీ నటి పూజిత జొన్నలగడ్డ ,అంతర్జాతీయ మోడల్ ఆశ్రిత రొయ్యూరు తదితర పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…