_తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేస్తున్నారు -బాధితులు
_మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తుసుకుని మాకు న్యాయం చేయాలి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తమ ప్లాట్లలో బయటి వ్యక్తులు వచ్చి అక్రమ వెంచర్లు వేసి, ప్లాట్లను ఇతర వ్యక్తులకు అమ్మి మాకు అన్యాయం చేస్తున్నారని భాధితులు సాంబశివరావు, కిరణ్ రాజు, భాస్కర్ రావు, సురేష్, నారాయణరావు సుబ్బారావు లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ లోని వారి ప్లాట్ల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, కొత్తగూడెం, మణుగూరు, కొలబెల్ట్ ప్రాంతంలోని సింగరేణిలో ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో 1985 లో మేమందరం సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం రామేశ్వర బండ గ్రామంలోని సర్వేనెంబర్ 183,184, 221 లోని దాదాపుగా 100 ప్లాట్లకు పైన (ఒక్కొక్క ప్లాటు 350 చదరపు గజాలు) సంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ న్యాయ స్థానం ఆధ్వర్యంలో వేలంలో కొన్నటువంటి వ్యక్తులు, లేఔట్ వేసి అమ్మిన ప్లాట్లను కొనుగోలు చేశామని అన్నారు. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని తెలిపారు. ఈ విషయం అంత రామేశ్వరం బండ గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు పూర్తిస్థాయిలో తెలుసని అన్నారు.
మాకు ఇల్లు నిర్మించుకోవడానికి గ్రామపంచాయతీ ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పారు. మా అందరికీ తెలియకుండా రామరాజు అనే వ్యక్తి తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేయడం జరిగినదని అన్నారు. దీనిపై అనేకసార్లు పోలీస్ స్టేషన్లో సైతం కేసు పెట్టేందుకై దరఖాస్తులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు. అదే వ్యక్తి మా ఫ్లాట్లలో ప్రవేశించి ప్రహరిగొడ నిర్మిస్తున్నారని, అంతే గాక మా ఫ్లాట్ లను చిందర వందర చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇది తెలిసి మేము అక్కడకు వెళ్ళగా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడమే గాక మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరేం చేయలేరు అని మమ్ములను బెదిరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా యొక్క ప్లాట్ లలో చేరబడి, మాకు బెదిరించి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత సభ్యులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…