బిస్లరీ కార్మికులకు శాండ్విక్, పార్లే యూనియన్లు సంపూర్ణ మద్దతు
న్యాయం జరిగే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. పాండురంగారెడ్డి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బిస్లెరి పరిశ్రమలో చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, యాజమాన్యం మొండివైఖరి విడనాడి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి , బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్ యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ పరిశ్రమ వద్ద జరిగిన కార్మికుల ఆందోళనకు శాండ్విక్ , పార్లే ఎంప్లాయిస్ యూనియన్లు సంఘీభావ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పి పాండురంగారెడ్డి మాట్లాడుతూ బిస్లరీ కార్మికులు న్యాయం జరిగే వరకు ఐక్యంగా ఉండి పోరాడాలని, బిస్లరీ కార్మికులకు శాండ్విక్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. చట్టం ప్రకారం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే తప్పేముందని, యూనియన్ పెట్టుకుంటే యాజమాన్యం కక్ష సాధింపులు చర్యలు, వేధింపులకు గురి చేయటం సరికాదన్నారు.
కార్మికులను తొలగించడం చట్టానికి విరుద్ధం అని కార్మికులం తొలగించి 28రోజులు అయినా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. మానిక్ మాట్లాడుతూ తొలగించిన బిస్లరి కార్మికుల వెంటనే తీసుకోని కార్మికుల న్యాయం చేయాలని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరించి పారిశ్రామిక ప్రశాంతతను నెలకొల్పాలన్నారు. తొలగించిన కార్మికులను బే షరతుగా వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిస్లెరీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేపక్షంలో పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్లే యూనియన్ ట్రెజరర్ రాజశేఖర్ మాట్లాడుతూ కార్మికులను తొలగించడం అన్యాయమని వెంటనే తీసుకోవాలని, బిస్లరీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి పార్లే యూనియన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ ఆందోళన కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ఆఫీస్ బేరర్ సదాశివరెడ్డి, పార్లే యూనియన్ జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్, నాయకులు వాసుదేవరావు, రాజు, జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, జాయింట్ సెక్రెటరీలు కృష్ణ కుమార్, అజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ గౌడ్ కమిటీ సభ్యులు రాము, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…