Telangana

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి కోకో క్రీడోత్సవాలు

-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభిస్తాయని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 44వ తెలంగాణ అండర్ 14 ఖో ఖో బాల–బాలికల అంతర్‌ జిల్లాల చాంపియన్షిప్–2025 పోటీలను టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కోకో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థి విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా నిరంతరం ఉచిత శిక్షణ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి పోటీలకు సైతం అతిథ్యం అందించబోతున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న క్రీడోత్సవాలకు సంపూర్ణ సహకారం అందిస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే విధంగా క్రీడాకారుల శిక్షణ అందిస్తోందని తెలిపారు. ఈ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సిఐ వినాయక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కోకో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి కిషన్, కార్యదర్శి శ్రీకాంత్, మైత్రి క్రికెట్ల అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago