Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో.. కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

భక్తజన సంద్రంతో, అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్

భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు

భక్త సంద్రంలో ముంచిన భజన గీతాలహరి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే. శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.అభ్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. దేవత మూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా తీర్చిదిద్దారు. శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగాయి. ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.సుమారు 10 వేల మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పట్టభద్రుల శాసన మండలి సభ్యులు అంజి రెడ్డి, దుబ్బాక శాసన సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, గూడెం కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago