politics

ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యార్థుల విజయకేతనం

ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యే ఇష్టా ప్రత్యేకత

అకాడమిక్ డీన్, ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్,ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యనందిచటమే ఇష్టా ఏ సంస్థల ప్రత్యేకత అని అ సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 2024 ఇంటర్ ఫలితాలలో ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థ (పటేల్ గూడ – పటాన్ చెరు) బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డీన్, పటాన్ చెరు బ్రాంచ్ ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్, ఇష్టా డైరెక్టర్ కె వినోద్ కుమార్ లు స్టేట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులను సన్మానించారు.ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్మీడియట్లో ఏం మనీషా 466, లావణ్య 465, బైపిసి లో యశస్విని 431,శైలి మోరి 427, హాసిని 425, మరియు సీనియర్ ఇంటర్ లో వేదవతి 986, లావణ్య 984, రాజేశ్వరి 982,నందిత 973, బి వైష్ణవి 971 తోపాటు మా విద్యార్థులు మరెన్నో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ఇష్టా డైరక్టర్ కే వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, రోజు ఒక గంట పాటు ఆటలు, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన అందించదం, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంచడమే ఐఐటి చుక్కారామయ్య ఇష్ట విద్యాసంస్థల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆ ఉద్దేశంతోనే పటాన్ చెరు, సంగారెడ్డిలో ఈ బ్రాంచ్ లను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు,తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

12 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

24 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

24 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 day ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 day ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago