జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…
ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్
-సీఎం కేసీఆర్ కు లేఖ
– చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి
-జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి
జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక మంది జరన్లిస్టులు కరోనా భారిన పది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ తన విధినిర్వహణలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారని అన్నారు. పోలీస్ , పారిశుధ్య కార్మికులు,, వైద్య సిబ్బంది లాగానే జర్నలిస్టులు కూడా పని చేస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలు జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలంగాణాలో ఎందుకు గుర్తించటంలేదో అర్థం కావడంలేదని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే జర్నలిస్టుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా , చేర్యాల మండలం చెందిన సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనా తో మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజెస్తున్నాను. ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయి. కరోనా తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలి . నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…