Telangana

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది 

బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం”

“రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ప్రజల దృష్టి మళ్లించేందుకు డ్రామాలు చేస్తున్న ప్రభుత్వం”

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపులకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు . పటాన్‌చెరు నియోజకవర్గం ఇన్స్పెక్షన్ బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ హైకోర్టు తాజా తీర్పును ఆయన స్వాగతించారు.గత మూడు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చేసిన ఆరోపణలు న్యాయస్థానం ముందు బట్టబయలయ్యాయని, రైతులకు నీరు అందించాల్సిన ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు.అదేవిధంగా, ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని, రైతు బంధు, రైతు భీమా పథకాలను సమర్థంగా కొనసాగించాలని ఆయన సూచించారు. అలాగే ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ , జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలాను బాల్‌రెడ్డి , రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ , కౌన్సిలర్లు నవీన్ కుమార్, సురేష్, సతీష్, రవీందర్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు పృథ్వీరాజ్, మాణిక్ యాదవ్, బీఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ బూన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రకాశ్ చారి, జగన్నాథ్ రెడ్డి, గణేష్, మాజీ సర్పంచ్ ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

5 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

24 hours ago