మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో వాడే ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. ఈ రోజుల్లో కల్తీ లేని ఆహార పదార్థాలు దొరకడం కష్టం ఐపోయింది. ఇలాంటి సమయంలో అశ్య ఫుడ్స్ వారు స్వచ్ఛమైన కల్తీ లేని ఆహార పదార్థాలను మన ముందుకు తీసుకొస్తున్నారు. కల్తీలేని ఆహారాన్ని అందించాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే అశ్య ఫుడ్స్. ఫౌండర్ శశిధర్ రెడ్డి కూతురు అశ్య పేరుమీద ఈ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా ఆరు ప్రొడక్ట్స్ ని మాత్రమే పరిచయం చేస్తున్నారు. త్వరలో మరొక 22 ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తారని తెలుస్తోంది.
నటుడు, రియల్ హీరో సోనుసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అశ్య ఫుడ్స్ ప్రొడక్ట్స్ ను ఫౌండర్ శశిధర్ రెడ్డి, కో-పౌండర్ హర్షిత మార్కెట్ కు పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా కారంపొడి, ఉప్పు, పసుపు, మిరియాలు, జిలకర, కిన్వా ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. Dice art films వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ సోనుసూద్, ఐఏఎస్ భవాని శ్రీ, డాక్టర్ గురువారెడ్డి, Dr నాజర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, రాజ్యసభ మెంబర్ వద్దిరాజు రవిచంద్ర, ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది, రోబోటిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, విజయ్ సేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంపెనీ బ్రాండంబాసిడర్ సోనూ సూద్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫౌండర్ శశిధర్ రెడ్డి, హర్షిత ఫ్యామిలీ లాంటి వారు. వారు అశ్య ఫుడ్స్ కంపెనీ గురించి చెప్పి లాంచ్ చేయాలి అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. వీరు చాలా కాలంగా తెలుసు ఇలాంటి వారు ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు అంటే ఎంత క్వాలిటీ గా ఉంటుందో నాకు తెలుసు అందుకే అడగ్గానే ఒప్పుకున్నాను అన్నారు. ఈ ప్రొడక్ట్స్ ప్రతి కిచెన్ లో ఉండాల్సిందే. ఇవి లేకుండా మనం ఆహారం తినలేము అన్నారు. వారు అడగగానే కాదనలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే తెలుగు వారు కావడం. ఇది తెలుగు గడ్డ ఎప్పుడు నాది అనిపిస్తుంది. అందుకే తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తుంటా అని పేర్కొన్నారు. ఇక కోవిడ్ పరిస్థితిల గురించి గుర్తు చేశారు. ఈ కంపెనీకి బ్రాండ్అంబాసీడర్ గా చెబుతున్న ఈ ప్రొడక్ట్స్ ఉన్న కిచెన్ బెస్ట్ కిచన్ అని అన్నారు.
బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి తొలితరం వ్యాపారవేత్తలు ముందుకు రావాలి అనే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫౌండర్ శశిధర్ రెడ్డిని అభినందించారు. తెలంగాణలో బిజినెస్ మెన్స్, తెలంగాణ సంస్కృతి గురించి వారి ఫ్రెండ్స్, పొలిటికల్ సర్కిల్ లో మాట్లాడుకుంటామని పేర్కొన్నారు. మొదటినుంచి మనది వ్యాపారం చేసే సంస్కృతి కాదని అందుకే తెలంగాణలో ఎక్కువగా వ్యాపారవేత్తలు లేరని అన్నారు. ఇకనుంచి కొత్తతరం వ్యాపారవేత్తలు పుట్టుకు రావాలని ఆకాంక్షిస్తూ ఆశ్య ఫుడ్స్ ఫౌండర్ శశిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అశ్య ఫుడ్స్ అదాని సూపర్ ఫుడ్స్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…