Telangana

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న అధ్యాపకులను తీర్చిదిద్దే చైతన్యవంతమైన కేంద్రంగా గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను రూపొందించినట్టు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు. హైదరాబాదు లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కొత్తగా రూపొందించిన అధ్యాపకుల గదులు, విద్యార్థుల కోసం నెలకొల్పిన కంప్యూటర్ ల్యాబ్ ను అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆయా ప్రదేశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ రిచా శర్మ మాట్లాడుతూ, ఈ కొత్త మౌలిక సదుపాయాల వెనుక ఉన్న దార్శనికతను వివరించారు. విద్యాపరమైన సహకారాన్ని, అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులను తీర్చిదిద్దుతున్నట్టు తెలియజేశారు. వినూత్నమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా గీతం యొక్క బహుళ విషయక విద్యా సంస్కృతిని బలోపేతం చేయడానికి తమ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కట్టుబడి ఉందన్నారు.

జాతీయ విద్యా విధానం-2020 దార్శనికతకు అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి రెండు నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను (ఐటీఈపీ) ప్రారంభించనున్నట్టు కూడా డాక్టర్ రిచా శర్మ ప్రకటించారు. విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణతో అనుసంధానించేలా బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులను రూపొందించినట్టు తెలియజేశారు. బలమైన బోధనా నైపుణ్యాలు, తరగతి గది నిర్వహణ సామర్థ్యాలు, సమకాలీన విద్యా పద్ధతులపై విద్యార్థులు లోతైన అవగాహనను పెంపొందించుకుంటూ, సైన్స్, గణితం, ఆంగ్లం లేదా సాంఘిక శాస్త్రాలలో ప్రత్యేకత సాధిస్తారని ఆమె వివరించారు.వ్యక్తిగత మార్గదర్శనం, ఉన్నత-నాణ్యత గల విద్యా ప్రమాణాలను నిర్ధారించడానికి, ఒక్కో కోర్సులో 50 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని డాక్టర్ రిచా శర్మ వెల్లడించారు. ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.

నిష్పక్షపాతమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తరఫున జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సీ.ఆర్.టీ)లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆమె స్పష్టీకరించారు.స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపనతో, భవిష్యత్తు తరగతి గదులను తీర్చిదిద్దగల సమర్థవంతమైన, దూరదృష్టి గల విద్యావేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, విద్యాపరమైన శ్రేష్ఠత, ఆవిష్కరణల పట్ల గీతం తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తోందన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ లతో పాటు పలువురు డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

18 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

19 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

19 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

23 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

23 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

24 hours ago