_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ
_ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి
పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం దశాబ్ది కాలంలో 9వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…