Telangana

పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తున్నారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు బోధించాలని, క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. . విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ నేతృతంలో ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పీపీ రాథోడ్, జెమిని కుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago