పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్, శిశు మందిర్ కాలనీలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అఫ్జల్, వెంకటేష్, అజ్మత్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరులో అద్భుత ప్రగతి.. పటాన్చెరు ,మనవార్తలు…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. పూర్తి…
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం…
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్ డివిజన్లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి…
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…